భారత్-పాకిస్థాన్ మ్యాచ్ లో మంచు లక్ష్మి సందడి

  • త్రివర్ణ పతాకం చేతబూని హుషారుగా కనిపించిన మంచు లక్ష్మి
  • మాంచెస్టర్ లో వరల్డ్ కప్ మ్యాచ్
  • ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో సెలబ్రిటీల కోలాహలం
టీమిండియా, పాకిస్థాన్ మధ్య మాంచెస్టర్ లో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ ను చూడ్డానికి సాధారణ ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కూడా బారులు తీరారు. క్రికెట్ ప్రముఖులే కాకుండా సినీ సెలబ్రిటీలు కూడా మాంచెస్టర్ లో సందడి చేశారు. మ్యాచ్ జరుగుతున్న ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో టాలీవుడ్ నటి, నిర్మాత మంచు లక్ష్మి కూడా దర్శనమిచ్చారు. ట్రెండీ అవుట్ ఫిట్స్ లో కనిపించిన ఆమె చేతిలో త్రివర్ణ పతాకంతో భారత జట్టును ఉత్సాహపరుస్తూ సగటు క్రికెట్ ప్రేమికురాలిగా సందడి చేశారు.
Go Back to Shorts
Cricket
Manchu Lakshmi

More Telugu News